Header Banner

పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోదీ తీర్మానం! భారత్ దాడి ఎప్పుడు? ఎక్కడ?

  Fri May 02, 2025 19:36        India

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రఘటన తర్వాత భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని యావత్ భారతావని కసిగా రగిలిపోతోంది. ఇక భారత్- పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధం ఏ క్షణం ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ దాడి చేస్తుందోనని కంటిమీద కునుకు లేకుండా పాకిస్థాన్ భయంతో ఉంది.



ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK) ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ ఓ ప్రకటనలో తెలిపినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ అవుతోంది. ఈ 13 నియోజకవర్గాల అత్యవసర పరిస్థితి కోసం ఒక బిలియన్ రూపాయలు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్‌(PoK)లో 1000కిపైగా మదర్సాలు ఖాళీ చేయించారు. పీఓకే సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు.



ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 

 

మరోవైపు ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్- భారత్ సరిహద్దు వెంబడి 29 నగరాల్లో పాకిస్థాన్ యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యుద్ధ సైరన్ మోగితే అక్కడి ప్రజలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎలా వ్యవహరించాలో అధికారుల ద్వారా సూచనలు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #pokcrisis #indiapakclash #modidecision #pahalgamattack #borderalert #surgicalstrike2 #warclouds